కుజ సంచారం: సంక్రాంతి నుంచి ఈ 4 రాశులకు రాజయోగం, పట్టిందల్లా బంగారం

Updated on: Jan 12, 2026 | 3:37 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలిక, సంచారం ఆయా రాశులపై ప్రభావం చూపుతుంది. గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మార్చుకోవడం వల్ల 12 రాశులు అనుకూల, ప్రతికూల ఫలితాలు పొందుతాయి. సంక్రాంతి తర్వాత రోజయిన జనవరి 16న ధైర్యం, శౌర్యం, శక్తి, కృషికి ప్రతీక అయిన కుజుడు.. ప్రత్యేక శుభ సంచారం చేయబోతున్నాడు. దీంతో రాజయోగం పొందనున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలిక, సంచారం ఆయా రాశులపై ప్రభావం చూపుతుంది. గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మార్చుకోవడం వల్ల 12 రాశులు అనుకూల, ప్రతికూల ఫలితాలు పొందుతాయి. ప్రతీ గ్రహం తన సంచారం వల్ల ఆయా రాశులకు వివిధ ఫలితాలను కలగజేస్తారు.

2 / 6
సంక్రాంతి తర్వాత రోజయిన జనవరి 16న ధైర్యం, శౌర్యం, శక్తి, కృషికి ప్రతీక అయిన కుజుడు.. ప్రత్యేక శుభ  సంచారం చేయబోతున్నాడు. కుజుడు శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో శని, కుజుల అరుదైన కలయిక ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్యశాస్త్రంలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక కలయిక వల్ల నాలుగు రాశుల వారికి అమితమైన శుభాలు కలగనున్నాయి. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశుల వారి కెరీర్, వ్యాపారం, సంపద, ఆత్మ విశ్వాసం వంటి అంశాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఆ ఫలితాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 6

మేషరాశి
మేషరాశి అధిపతి కుజుడు. అందుకే ఈ గ్రహ సంచారం వీరికి శుభప్రదంగా భావిస్తారు. వీరికి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి పవిత్ర తీర్థయాత్ర చేపట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. కొత్త భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.

మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు. అందుకే ఈ గ్రహ సంచారం వీరికి శుభప్రదంగా భావిస్తారు. వీరికి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి పవిత్ర తీర్థయాత్ర చేపట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. కొత్త భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.

4 / 6
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ కుజ సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి అదృష్టం పడుతుంది. దీంతో వీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిచేసే చోట పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. సకాలంలో లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ కుజ సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి అదృష్టం పడుతుంది. దీంతో వీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిచేసే చోట పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. సకాలంలో లాభాలు పొందుతారు.

5 / 6
మకర రాశి
కుజ సంచారంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను అందుతాయి. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఆర్థిక లాభాలను తెస్తాయి. ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

మకర రాశి కుజ సంచారంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను అందుతాయి. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఆర్థిక లాభాలను తెస్తాయి. ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

6 / 6
తులా రాశి
తులా రాశి వారు కుజ సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూమి, భవనాల నుంచి ప్రయోజనాలుంటాయి. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు అకస్మాత్తుగా డబ్బు అందుతుంది. 
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.

తులా రాశి తులా రాశి వారు కుజ సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూమి, భవనాల నుంచి ప్రయోజనాలుంటాయి. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు అకస్మాత్తుగా డబ్బు అందుతుంది. Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.