Ayodhya New Airport : విదేశీ విమానాశ్రయాలకు పోటీగా.. అయోధ్య ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. అద్భుతమైన ఫోటోలు

| Edited By: Ram Naramaneni

Dec 29, 2023 | 5:49 PM

2024 జనవరి 22ప అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయం ఆసన్నమైంది. ఇక్కడికి చేరుకునేందుకు జనం సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమాన మంత్రిత్వశాఖ వెల్లడించింది..

1 / 6
పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న అంతర్జాతీయ విమానాశ్రయం విదేశాలకు పోటీగా నిలుస్తోంది. ఇక్కడ VIP లాంజ్ 5 స్టార్ హోటల్ రేంజ్‌లో కనిపిస్తుంది.

2 / 6
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 30 శనివారం ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా 6,500 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1450కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయం మొదటి దశ పూర్తి చేశారు.

3 / 6
భగవాన్ శ్రీరాం పెయింటింగులతో ఈ విమానాశ్రయ భవనాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య ధాం విమానాశ్రయంలో ఎల్ఈడీ లైట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ల్యాండ్ స్కేపింగ్, ఫౌంటెన్లు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు.

4 / 6
ఒక పెద్ద హోటల్‌లా అందమైన సోఫాలు, విలాసవంతమైన ఇంటీరియర్‌లతో ఈ ఎయిర్‌ పోర్ట్‌ను ఎంతో సుందరంగా తీర్చి దిద్దారు. ఈ లాంజ్ ఫైవ్ స్టార్ హోటల్ లా కనిపిస్తుంది. అయోధ్యలోని ఈ విమానాశ్రయం పట్టణ శైలిలో రూపొందించబడింది. నగర శైలి ఉత్తర భారతదేశంలోని ఆలయ శైలి.

5 / 6
ఈ ఎయిర్‌ పోర్టు మధ్యలో ప్రధాన శిఖరం, ముందు భాగంలో 3, వెనుక 3 శిఖరాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ చూసినా ఆ శ్రీరామ చంద్రుడి ప్రతిరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. వెలుపల విల్లు, బాణం ఏర్పాటు చేశారు.

6 / 6
2024 జనవరి 11 నుండి ఈ విమానాశ్రయం నుండి అహ్మదాబాద్, అయోధ్య మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడుస్తాయి. ఈ అయోధ్య విమానాశ్రయం ప్రారంభంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందటంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.