Macadamia Nuts: గుండె ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరం మకాడమియా నట్స్.. ఎక్కడ కనిపించినా వదలకండి..

Updated on: Aug 14, 2025 | 4:34 PM

డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని గుర్తు చేసుకుంటారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి మకాడమియా గింజలు. వీటినే మెకడమియా నట్స్ అని కూడా అంటారు. ఇవి వెన్నవంటి రుచిని సహజమైన తీపిని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మెకడమియా నట్స్ వేయించి తినవచ్చు. లేదా ఇతర వంటకాల్లో చేర్చుకుని తినవచ్చు. ఈ రోజు మెకడమియా నట్స్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 9
మెకడమియా నట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను పచ్చిగా, వేయించి లేదా వంటకాల్లో ఉపయోగించి తింటారు. మకాడమియా గింజలలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

2 / 9
 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, మెదడు పనితీరును పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే వీటిలో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉన్నాయి. కనుక తక్కువగా తినడం మంచిది. అరుదైన గింజ మెకడమియా నట్స్ ని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

3 / 9
గుండె ఆరోగ్యం: మెకడమియా నట్స్‌లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-9, ఒమేగా-7 కొవ్వు ఆమ్లాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి తద్వరా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4 / 9

మెదడు పనితీరు: దీనిలో ఉన్న పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

5 / 9
షుగర్ లెవెల్ క్రమబద్ధం: మెకడమియా నట్స్‌ షుగర్ వ్యాధి బాధితులకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. కనుక మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. ఈ గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మధుమేహం ఉన్నవారికి మకాడమియా గింజలు తినడం మంచి ఎంపిక కావచ్చు. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిస్తాయి.

షుగర్ లెవెల్ క్రమబద్ధం: మెకడమియా నట్స్‌ షుగర్ వ్యాధి బాధితులకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. కనుక మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. ఈ గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవారికి మకాడమియా గింజలు తినడం మంచి ఎంపిక కావచ్చు. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిస్తాయి.

6 / 9
బరువు నిర్వహణ: మెకడమియా నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్నాయి. కనుక వీటిని తింటే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో తినాలనే కోరిక తక్కువగా కలుగుతుంది. దీని వలన బరువును నియంత్రించడంలో ఇవి  సహాయపడతాయి

7 / 9

పోషకాహారం: వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తినడం వలన శరీరానికి అవసరం అయిన పోషకాలు అందుతాయి.

8 / 9
మకాడమియా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. వాపును తగ్గిస్తాయి. మకాడమియా గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలక్రమేణా మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

9 / 9

అయితే ఈ మకాడమియా గింజలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తక్కువగా తినడం మంచిది. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.  అంతేకాదు కొంతమందికి ఈ నట్స్ పడకపోవచ్చు. ముఖ్యమగా అలెర్జీ సమస్య ఉన్నవారికి.. కనుక గింజలకు అలెర్జీ ఉన్నవారు మకాడమియా గింజలకు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది.