Lungs Health: ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే..

|

Mar 26, 2023 | 3:34 PM

ఊపిరితిత్తులు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అందుకనే ఊపిరితిత్తులు పనిచేయకపోతే మనిషి మనుగడ అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

1 / 6
 ఊపిరితిత్తులు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అందుకనే ఊపిరితిత్తులు పనిచేయకపోతే మనిషి మనుగడ అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ క్రమంలో మీరు తెలుసుకోవలసిన విషయాలివే..

2 / 6
ధూమపానం: ధూమపానం మీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. సిగరెట్‌లో వేలాది రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మీ ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీయడమే కాక లంగ్ క్యాన్సర్‌కు కారణంగా మారగలవు.

3 / 6
కాలుష్యం: వాతావరణంలోని కాలుష్యం మీ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్ ఫ్రెషనర్స్ వంటి ఉత్పత్తులు రసాయన కాలుష్యాలను గాలిలోకి విడుదల చేస్తాయి.

4 / 6
శ్వాస వ్యాయామాలు: శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మీ ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ సరఫరాను నిర్వహించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్య సమస్యలను కూడా ఈ బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ నివారిస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తప్పక బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ చేయండి.

5 / 6
వ్యాయామం: వ్యాయామం మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ఇంకా ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాక శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, నిరంతర దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.

6 / 6
ఆహారం: యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, ప్రొటీన్లు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. వీటి ద్వారా ఊపిరితిత్తుల పనితనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.