LPG Cylinder Rules: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిందా..? పరిహారం ఎలా పొందాలో తెలుసుకోండి

|

Dec 13, 2022 | 9:02 PM

కట్టెల పొయ్యిపై వంట చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం అందరికీ ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. అయితే చాలా సార్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణ నష్టం ..

1 / 5
కట్టెల పొయ్యిపై వంట చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం అందరికీ ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. అయితే చాలా సార్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో పరిహారం కూడా ఎల్‌పీజీ కంపెనీ ద్వారా అందుకోవచ్చు. ఈ సమాచారం చాలా మందికి తెలియదు. దీంతో ప్రమాదం జరిగినా పరిహారం అందడం లేదు.

2 / 5
ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ సమయంలో కస్టమర్లందరికి కంపెనీచే బీమా సదుపాయం ఉంటుంది. దీనిని ఎల్‌పీజీ బీమా కవర్ పాలసీ అంటారు. ప్రమాదవశాత్తు సిలిండర్ లీకేజీ, పేలుడు సంభవించినట్లయితే అందుకు నష్టాన్ని బట్టి పరిహారం అందుకోవచ్చు.

3 / 5
ఎల్‌పీజీ కంపెనీ ద్వారా ప్రతి వినియోగదారుడు 50 లక్షల రూపాయలకు బీమా పొందవచ్చు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి, వినియోగదారుడు లేదా అతని కుటుంబ సభ్యులెవరైనా గాయపడినా లేదా ఆస్తి నష్టం జరిగినా, ప్రమాదవశాత్తూ రూ.40 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

4 / 5
పేలుడు వల్ల ప్రాణనష్టం జరిగితే రూ.50 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. అలాగే ప్రమాదంలో గానీ, పేలుళ్లలో గానీ ప్రాణ నష్టం జరగకపోయినా, ఆస్తినష్టం జరిగినా రూ.2 లక్షల పరిహారం పొందవచ్చు.

5 / 5
అయితే బీమా పరిహారం పొందడానికి ఒక షరతు ఏమిటంటే ఎల్‌పీజీ సిలిండర్ ఎవరి పేరు మీద కనెక్ట్ చేయబడిందో వారికి మాత్రమే బీమా డబ్బు వస్తుంది. ఈ బీమాకు నామినీ లేనందున కస్టమర్ కుటుంబంలో మరెవరూ బీమా మొత్తాన్ని లేదా పరిహారం అందుకోరు.