
నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒంటరితనం సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఆ విషయం వాళ్లకి చాలా ఆలస్యంగా అర్థం అవుతుంది. ఒంటరితనం సమస్యను అర్థం చేసుకునే సమయానికి, అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నిజానికి, ఒంటరితనం అనేది మన జీవితంలోని అనేక సమస్యల కంటే చాలా పెద్ద సమస్య.

ఆరోగ్య సంరక్షణ కోసం US ఏజెన్సీ ఒంటరితనంపై భయంకరమైన నివేదికను వెలువరించింది. ఒంటరితనం కూడా వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుందట. సామాజిక ఆందోళన ఒంటరితనానికి దారి తీస్తుంది. ఇతరులతో మాట్లాడటం లేదా సోషల్ బాహేవియర్‌లో వారికి ఇబ్బంది తలెత్తుతుంది. తమ గురించి ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళన వారిలో ఎక్కువగా ఉంటుంది.

ఒంటరితనం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజికంగా ఒంటరిగా ఉన్న వారికి అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒంటరితనం ఆహారపు అలవాట్లపై కూడా ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. క్రమరహితమైన ఆహారపు అలవాట్లతో మధుమేహం సమస్యలు ఎక్కువగా వస్తాయి.

డిప్రెషన్‌కు కారణాలలో ఒంటరితనం ఒకటిగా పరిగణిస్తుంటారు నిపుణులు. ఒంటరిగా ఉన్నప్పుడు నెగెటివ్ ఆలోచనలు చుట్టుముడతాయట. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఆత్మనూన్యతకు లోనవుతారు. ఎక్కువ కాలం ఒంటరితనంతో బాధపడేవారిలో కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.