Lemon Water: రోజూ నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుంది.. ఇవి పక్కా తెలుసుకోండి..

Updated on: Nov 14, 2025 | 8:04 AM

చాలా మంది ప్రతిరోజు నిమ్మకాయ నీరు తాగుతారు. అయితే శరీరాన్ని రిఫ్రెష్ చేసే నిమ్మకాయ నీటి ప్రయోజనాలు, అపోహలు గురించి అవగాహ ఉండడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మరి దీనిపై ఉన్న అపోహలు ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

1 / 5
నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుంది, ఇది శరీరానికి చాలా అవసరం.నిమ్మకాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదపడుతుంది. ఒక గ్లాసు నిమ్మకాయ నీరు రోజువారీ విటమిన్ సి అవసరాన్ని పూర్తిగా తీర్చకపోయినా, ఇది ఉదయం శరీరానికి అదనపు పోషకాల మోతాదును అందిస్తుంది.

2 / 5
ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.

3 / 5
వేడి చేయవద్దు: వేడి నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మరసాన్ని వేడి చేసినప్పుడు, దానిలోని కీలక పోషకమైన విటమిన్ సి దెబ్బతింటుంది. కాబట్టి నిమ్మరసం కలుపడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

4 / 5
ఆయుర్వేదం ప్రకారం.. వేడి పదార్థాలతో తేనె కలిపి తాగడం అస్సలు మంచిది కాదు. దీనిని సేవించడం అస్సలు ఆరోగ్యకరం కాదు. ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

5 / 5
తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. ఉడికించకూడదు. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మీరు వేడి పాలు లేదా నీటిలో తేనె కలిపితే ఆ వేడికి విషపూరితంగా మారుతుంది.