
మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. మన రోజంతా యాక్టీవ్‌గా పని చేయాలంటే అంతకు ముందు నైట్ మనం సంపూర్ణంగా నిద్రపోవాలి. అయితే నిద్రపోయేప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో భంగిమలో పడుకుంటారు. కానీ ఈ అలవాట్లు వారికి అరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.

కొంతమంది ఎడమ వైపు పడుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరు కుడి వైపు పడుకోవడానికి ఇష్టపడతారు. కానీ, మనం నిద్రపోయే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

నేటి ఆధునిక యుగంలో, యువత ఒకే చోట ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భంగా వారికి నిద్ర సరిగ్గా లేకపోతే అది మరింద్ర తీవ్రతరం అవుతుంది. కాబట్టి మీరు మీ ఎడమ వైపు పడుకోవడం వల్ల నొప్పి నుండి మీరు ఉపశమనం పొందవచ్చు.

మీకు కుడి వైపు లేదా మీ కడుపుపై పడుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఈ స్థితిలో పడుకోవడం మీ నిద్ర ప్రభావితం కావడంతో పాటు మీ శరీర అవయవాల పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి, మీ ఎడమ వైపు పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ పేగులు, ప్రేగు కదలికలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎడమ వైపు పడుకోవడం మన గుండెకు మేలు చేస్తుంది. గుండె మన శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రకమైన నిద్ర ఒత్తిడిని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.