వడ్రంగిపిట్ట పదునైన పొడవాటి ముక్కుతో వందలాది రంధ్రాలను సులువుగా చేస్తుంది. వాస్తవానికి ఈ పక్షి చెట్టు కలపని తినడానికి చేస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని వెనకున్న సీక్రెట్ ఎంటో తెలుసుకుందాం.
వడ్రంగిపిట్టలు చాలా కారణాల వల్ల చెట్లకి రంధ్రాలు చేస్తాయి. ఉదాహరణకు ఇవి చెక్కలో నివసించే కీటకాలు, చిమ్మటలను తినడానికి రంధ్రాలని చేస్తుంది.
ఇది తన పదునైన ముక్కుతో రంధ్రం చేసి దాని లోపల ఉన్న కీటకాలను తింటుంది. ఇది కాకుండా అది చెట్టు కాండంలో ఉండే రసాన్ని తాగడానికి ఇష్టపడుతుంది. ఇది తన ఇంటిని నిర్మించుకోవడానికి కూడా రంధ్రాలని చేస్తుంది.
వడ్రంగి పిట్టలు చాలా వేగంగా రంధ్రాలని చేయగలవు. ఇలా చేయడం వల్ల ఇవి అస్సలు అలసిపోవు. అంతేకాదు వాటి ముక్కు కూడా దెబ్బతినదు.
దీని ముక్కు రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి బయటి పొర, రెండోది లోపలి పొర. ముక్కు బయటి భాగం చాలా గట్టిగా ఉంటుంది. లోపలి భాగం చాలా మృదువుగా ఉంటుంది.