Spicy Food: కారం అధికంగా తింటే వెంటనే నోటి నుంచి కళ్ల నుంచి నీరు వస్తాయి.. రీజన్ ఏమిటంటే..

|

Aug 31, 2023 | 1:53 PM

షడ్రుచుల్లో ఒకటి కారం.. ఆహారానికి రుచిని తీసుకుని వచ్చే కారాన్ని మిరపకాయలతో తయారు చేస్తారు. అదే సమయంలో కొందరు మిరపకాయలను తినడానికి ఇష్టపడతారు. అలా మిరపయ తింటే శరీరంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. కొందరికి ఒకొక్కసారి కళ్లు, ముక్కులో నీరు రావడం మొదలవుతుంది.  కారం అధికంగా తింటే ముక్కు, కళ్లలో నుంచి నీళ్లు రావడం సర్వసాధారణంగా అందరికీ జరిగి ఉండవచ్చు. అయితే ఎందుకు ఇలా కళ్లు, నీరు నుంచి నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. పరిశోధనలు ఏమి చెప్పాయంటే.. 

1 / 5
మసాలాతో కూడిన ఏదైనా ఆహారాన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే అందులో కొంచెం కారం ఎక్కువైతే చాలు అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. 

2 / 5
కారం ఎక్కువైనా సరే.. లేదా మిరపకాయను కోరినా వెంటనే నోటి నుండి హుస్ అనే శబ్దం చేస్తారు. నోరు మొత్తం మండిపోతుంది. అప్పుడు వెంటనే చేతి నీటి గ్లాసు కోసం వెతుకుతుంది. మరోవైపు ముక్కు,  కళ్ళ నుండి నీరు ప్రవహిస్తుంది. 

3 / 5
 ఇలా కారం తిన్న వెంటనే నోరు మండటానికి కారణంపై అమెరికన్ కెమికల్ సొసైటీ ఒక అధ్యయనం ప్రకటించింది. మిరపకాయలో కెప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది

4 / 5
మిరపకాయకు రసాయనం ఒక రక్షణ కవచం అని తెలుస్తోంది. ఎందుకంటే జంతువులు, మానవులు ఈ రసాయనాల వలన మిర్చి మొక్కను టచ్ చేయలేరు. ఒక రకంగా కెప్సైసిన్ అనే రసాయనం మిర్చిని కాపాడుతుందన్నమాట. 

5 / 5
ఈ రసాయన స్వభావంతో నోటికి తగిలిన వెంటనే శరీరంలో మంటను కలిగిస్తుంది. దీని తర్వాత మన శరీరం రక్షణలోకి వెళుతుంది.  కెప్సైసిన్ రసాయనం శరీరాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే శరీరంలోని ముక్కు, కళ్ల నుంచి ఆ రసాయనాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది.  దీని కారణంగా ముక్కు, కళ్ళ నుండి నీరు రావడం ప్రారంభమవుతుంది.