uppula Raju |
Jan 31, 2022 | 8:02 PM
మసాలాతో కూడిన ఆహారం తింటే సరదాగా ఉంటుంది. కానీ అందులో మిరపకాయలు తగిలితే వెంటనే ముక్కు, కళ్ళ నుంచి నీరు రావడం మొదలవుతుంది. కారం నోట్లోకి రాగానే కళ్ల నుంచి నీళ్లు కారడం మొదలవుతుంది. ఎందుకో ఆలోచించారా..
వాస్తవానికి మిరపకాయలో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల కారంగా ఉంటుంది.
మిరపకాయకు ఈ రసాయనం ఉండటం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే జంతువులు, మానవులు మిర్చి పంటకు హాని చేయలేరు. అంటే ఒక విధంగా మిరపకాయను కాపాడుతుంది.
ఈ రసాయనం నోటికి తగలగానే శరీరంలో చికాకు వస్తుంది. తర్వాత మన శరీరం రక్షణలోకి వెళుతుంది.
దీని తర్వాత శరీరం ఈ రసాయనాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల శరీరం ముక్కు, కళ్ళ నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా ముక్కు, కళ్ళ నుంచి నీరు రావడం ప్రారంభమవుతుంది.