

అయితే మధుమేహ బాధితులకు గోధుమ పిండితో చేసిన రొట్టె, మైదాతో చేసిన వంటలు మంచిది కాదని పేర్కొంటున్నారు. గోధుమ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్లు ఏ పిండితో చేసిన రొట్టెలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిక్ పేషెంట్లు రోటి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్లకు జొన్న పిండి రోటీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో జొన్న పిండి రోటీని చేర్చుకోవాలని పేర్కొంటున్నరు.

జొన్న రొట్టె వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. జొన్నలో డైటరీ ఫైబర్ ఉంది. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటీన్లు, మెగ్నీషియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది.

శెనగపిండి రోటీ: శెనగపిండితో చేసిన రొట్టె మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఈ పిండి గ్లూటెన్ ఫ్రీ.. ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి చాలా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో లేకుంటే, ఈరోజే మీ ఆహారంలో శనగ పిండి రోటీని చేర్చుకోండి.

రాగి రోటీ: రాగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది షుగర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పిండిని తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది.