- Telugu News Photo Gallery Know these are beneftis for ice facial at home check here how to properly do
Ice Facial: వేసవిలో ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై రుద్దుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోండి..
Skin Care: చాలా మంది ఎండాకాలంలో ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై రుద్దుతుంటారు. దీంతో ముఖానికి చల్లదనం కలగడమే కాకుండా.. నిగారింపుగా కనిపిస్తుంది. కానీ ఐస్ క్యూబ్స్ రబ్ చేయడం వలన అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామా.
Updated on: Apr 18, 2022 | 6:05 PM

చాలా మంది ఎండాకాలంలో ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై రుద్దుతుంటారు. దీంతో ముఖానికి చల్లదనం కలగడమే కాకుండా.. నిగారింపుగా కనిపిస్తుంది. కానీ ఐస్ క్యూబ్స్ రబ్ చేయడం వలన అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామా.

వేడి వాతావరణంలో వడదెబ్బ ఎక్కువగా ఉంటుంది. చర్మం కొద్దిగా సున్నితంగా ఉంటే.. ఎరుపుగా మారడం.. అలెర్జీలు, దురద సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చక్కగా పనిచేస్తుంది.

ఐస్ ఫేషియల్ చేయడం వలన ముఖంపైన ఉండే రంధ్రాలు శుభ్రమవుతాయి. వాటి పరిమాణం తగ్గిపోతుంది. వీటి పరిమాణం పెరిగితే చర్మ సౌందర్యం తగ్గుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ ఉపయోగపడుతుంది.

ఐస్ క్యూబ్స్ ను సున్నితంగా ముఖంపై రుద్దడం, నెమ్మదిగా మసాజ్ చేయడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. మంచు నీరు టోనర్ గా పనిచేస్తుంది. మీ చర్మాన్ని శుభపరచడంతోపాటు.. ప్రకాశవంతంగా చేస్తుంది.

ఐస్ క్యూబ్స్ ఫేషియల్ మొటిమలను తగ్గిస్తుంది. చర్మం తేమను నిలుపుతుంది. దీంతోపాటు.. వేడి వాతావరణంలో వచ్చే జిడ్డు చర్మం సమస్య కూడా తగ్గుతుంది. ఇంతకీ ఐస్ క్యూబ్స్ ఫేషియల్ ఎలా చేయాలో తెలుసుకుందామా.

ముందుగా మీ ముఖాన్ని తేలికపాటి ఫేస్‌వాష్‌తో కడగాలి. దీంతో చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళీ తొలగిపోతాయి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ ను మెత్తని క్లాత్ లో చుట్టి చర్మంపై రుద్దాలి. మంచు కరిగినప్పుడు ఆ క్లాత్ తో తుడవాలి.

ఆ తర్వాత ఐస్ ప్యాక్ తీసుకుని చర్మంపై 1-2 నిమిషాలు ఉంచాలి. దీన్ని వృత్తాకార కదలికలో చర్మంపై రుద్దాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీంతోపాటు.. రోజ్ వాటర్, గ్రీన్ టీతోపాటు ఐస్ క్యూబ్స్ కలిపి ఫేషియల్ చేస్తే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది..




