
ఎర్ర జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: జామకాయ తినడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఉన్న ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. విశేషమేమిటంటే ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. అనర్ధాలను తొలగిస్తుంది.

కండరాలను రిలాక్స్ చేస్తుంది: జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి అన్ని భాగాలకు వ్యాపించి కండరాలకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనితో పాటు ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

విటమిన్ సి: ఈ జామపండులోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. మీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే, అది మీ రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. కావున కచ్చితంగా జామపండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైడ్రేట్‌గా ఉంచుతుంది: పచ్చి ఎర్ర జామకాయ ప్రత్యేకత ఏమిటంటే.. క్రమం తప్పకుండా తింటే.. శరీరాన్ని చాలా సమయం వరకు హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. కావున దీన్ని ఖచ్చితంగా తినండి.

దగ్గు, జలుబు: సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల తరచుగా జలుబు, దగ్గు, కఫం సమస్యలు వస్తాయి. దీంతోపాటు అలెర్జీ సమస్య కూడా వస్తుంది. దీని కోసం మీరు యాంటీ-ఫ్లెగ్మ్ గుణాలు కలిగిన జామను తింటే మంచిది.