Rajitha Chanti |
Mar 09, 2022 | 9:07 PM
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది నరాల నొప్పితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నరాల నొప్పి సమస్యను తగ్గించేందుకు ఈ చిట్కాలను పాటించాలి.
రాక్ సాల్ట్.. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నరాల నొప్పి నుంచి ఉపశమనంలో పొందడంలో సహాయపడుతుంది.
పసుపులో చాలా ఔషధగుణాలున్నాయి. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది నరాల నొప్పిని మాత్రమే కాకుండా.. వివిధ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం ఉంటుంది.
వేడి.. చల్లని ఆవిరి తీసుకోండి. నరాల నొప్పి తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. నరాల నొప్పి వచ్చిన 48 గంటల వరకు వేడి ఆవిరిని (హాట్ కంప్రెస్ లను) ఉపయోగించకూడదు. చల్లని ఆవిరి తీసుకోవడం వలన నొప్పి ప్రాంతంలో వాపు తగ్గుతుంది.
నరాల నొప్పి తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయమం చేయాలి. శరీరాన్ని సాగదీయడం.. వ్యాయామం చేయడం.. యోగా నరాల నొప్పిని తగ్గించడం సహాయపడుతుంది.
విటమిన్ బి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. విటమిన్ బి ఎర్ర రక్త కణాలను పెంపోదిస్తాయి. ఎముకలు.. నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ బి లోపం వలన చాలా మందికి నరాల నొప్పి వస్తుంది.