అయితే, మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మామిడికాయలను శుభ్రంగా కడగాలి. మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి శుభ్రం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు పండ్లను తినకూడదు. కానీ మామిడిపండ్లు మాత్రం తినొచ్చు. మామిడిని పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. ఇలా చేస్తే శృంగారం మీద ఆసక్తి పెరుగుతుంది. సాధారణంగా మామిడిపండు సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.
ఇంకా సంతాన సమస్యలను దూరం చేయడంతోపాటు.. వీర్య కణాలను పెంచడం.. స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయని పేర్కొంటున్నారు నిపుణులు..
అయితే, జీర్ణ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, సొరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులు, చర్మ సమస్యలు ఉన్నవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోవద్దు.
మామిడిపండ్లు మలబద్ధకం లాంటి సమస్యను పొగొట్టడంతోపాటు.. చర్మ కాంతికి సహాయపడతాయి.