వైద్యులు, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం... పెరుగును వేడి వేడి ఆహారంలో తీసుకోవాలంటుంటారు.. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. దీనికి తోడు ఎండు ద్రాక్షను పుల్లటి పెరుగుతో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. వేసవిలో పుల్లటి పెరుగులో కిస్ మిస్ వేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకోండి.

వయసు పెరిగే కొద్ది ఎముకల సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులు సమస్యలు ఉన్నవారు.. పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్షను కలిపి తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలపర్చడంలో సహాయపడుతుంది.

పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం వలన మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. శారీరక నొప్పులు దూరమవుతాయి.

పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.