
కిళ్లీలో తరుచుగా ఉపయోగించే వక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వక్కల్లో విటమిన్ బి6, సిలతో పాటు ఫాస్పరస్, కాల్షియం, కాపర్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వక్కల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తాయి.

వక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉండటంతో చెడు బ్యాక్టీరియా తొలగి నోటీ దుర్వాసన పోతుంది. వక్కల్లోని రసాయనాలు ఆహారం బాగా అరిగేలా చేస్తాయి. ఫలితంగా, మలబద్ధకం కూడా పోతుంది.

వక్కల్లో ఉండే పోషకాలు దంతాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఇందులో లభించే కాల్షియం దంతాలను ధృఢంగా మార్చుతుంది. వక్కలను ప్రతి రోజూ తీసుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది.

వక్కలను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. వక్కలను తరుచూ తీసుకుంటే అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

వక్కలను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని పుక్కలిస్తే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలను తింటే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నప్పుడు వక్కలను తినడం ఉత్తమం. ఇవి చిగుళ్లను దృఢంగా మార్చుతాయి.

పీరియడ్స్ టైంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, తిమ్మిరితో ఇబ్బంది పడతారు. పీరియడ్స్ టైంలో వక్కల పొడిని తినడం, లేదా వక్కలతో తయారు చేసిన డికాక్షన్ తాగడంతో నొప్పి తగ్గుతుంది.