
బొద్దింకలు ఇంటి మూలల్లో దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాటన్ ప్యాడ్లు బొద్దింకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. కాలక్రమేణా బొద్దింకల సమస్య తగ్గుతుంది. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంట్లో బొద్దింకల సంఖ్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

బొద్దింకల వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఆరు రకాల బ్యాక్టీరియా వల్ల సంభవించవచ్చు. అవి ఏంటంటే సాల్మొనెలోసిస్ ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తే.. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయి. ఇది పిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి అత్యంత ప్రమాదకరం.

ఇక రెండవది గ్యాస్ట్రోఎంటెరిటిస్ బ్యాక్టీరియా. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. అలాగే మూడోవది అలెర్జీలు, ఆస్తమా. బొద్దింక చర్మం, లాలాజలం, మలంలోని అలెర్జీ కారకాలు గాలిలోకి విడుదల కావచ్చు. ఇవి పిల్లలలో ఆస్తమా రావడానికి ఒక ప్రధాన కారణం.

కానీ మీరు కొన్ని ఉపాయాలు ద్వారా ఇంట్లో బొద్దింకలను తరిమికొట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా బొద్దింకల సమస్య తగ్గుతుంది. రాత్రిపూట బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఇంట్లోని నీరు బయటకు వెళ్లే ప్రదేశంలో ఈ వస్తువును ఉంచితే బొద్దింకలు వెంటనే మాయమవుతాయి.

వంటగది సింక్, కుళాయిలు, బయటి కాలువల నుంచి బొద్దింకలు బయటకు వస్తే, వాటిని వదిలించుకోవడానికి మీరు ఒక ప్రత్యేక మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, రెండు టీస్పూన్ల ద్రవ డెటాల్ తీసుకోవాలి.