Kiwi Benefits: ఈ వ్యాధులున్నవారు కివీ పండ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే!

|

Aug 25, 2022 | 12:15 PM

కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి..

1 / 7
 కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండులో ఉండే రెండు రకాల ఫైబర్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పలు రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకో కివీ పండు తిన్నట్లయితే.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

2 / 7
ఫ్లూ: కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. రోగనిరోధక వ్యవస్థను సైతం బలపరుస్తుంది. తద్వారా ఫ్లూను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 7
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కివీలో విటమిన్ సి, పాలీఫెనాల్స్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి. గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తాయి. అందుకే గుండె ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకో కివీ తినాల్సిందేనని డాక్టర్లు అంటున్నారు.

4 / 7
యాంటీఆక్సిడెంట్లు- కివీలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల నుంచి ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి.

5 / 7
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది- కివీలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.

6 / 7
వీరు అస్సలు తినకూడదు: కిడ్నీ సమస్యలు, స్కిన్ అలెర్జీ, గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు కివీ పండ్లకు దూరంగా ఉండాలి.

7 / 7
గర్బిణీ స్త్రీలు రోజుకు రెండు లేదా మూడు కివీ పండ్లు తీసుకోవడం మంచిది. ఆ మోతాదు మించకూడదు. కివీని ఎక్కువగా తీసుకుంటే అసిడిటీ, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది.