Kitchen tips: కట్‌ చేసిన కూరగాయ ముక్కలు ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..

|

Sep 20, 2022 | 11:34 AM

ఉదయం నిద్రలేవగానే పని హడావిడి, ఆఫీసు హడావిడిలో ఇంట్లో అందరికీ సరిపడా వంట చేయడానికి తగిన సమయంలో ఉండదు. టైం పొదుపు చేయడానికి చాలా మంది ముందు రోజు రాత్రి కూరగాయలు కట్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టి, ఉదయం వాటితో..

1 / 5
ఉదయం నిద్రలేవగానే పని హడావిడి, ఆఫీసు హడావిడిలో ఇంట్లో అందరికీ సరిపడా వంట చేయడానికి తగిన సమయంలో ఉండదు. టైం పొదుపు చేయడానికి చాలా మంది ముందు రోజు రాత్రి కూరగాయలు కట్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టి, ఉదయం వాటితో వంట చేస్తారు. ఐతే కట్ చేసిన కూరగాయలను ఫ్రిజ్‌లో సరిగ్గా ఉంచకపోతే, అవి నల్లగా మారే అవకాశం ఉంటుంది. ఇలా చేశారంటే కూరగాయ ముక్కలు ఫ్రెష్‌గా ఉంటాయి.

2 / 5
గుమ్మడికాయ విత్తనాలను తీసివేసి చిన్న ముక్కలుగా కట్ తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఫ్రెష్‌గా ఉంటాయి.

3 / 5
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి వాటిని కట్ చేసి లైట్ గా ఫ్రై చేసి, టిష్యూ పేపర్‌లో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.

4 / 5
పాలకూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకు కూరలు త్వరగా చెడిపోతాయి. ఇటువంటి ఆకుకూరలను ముందుగా కాడల నుంచి ఆకులను తొలగించి భద్రపరిస్తే తాజాగా ఉంటాయి. కొత్తిమీర ఆకులను కాగితంలో చుట్టి ఉంచితే.. చాలా కాలం పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. బీన్స్‌ను ప్లాస్టిక్ జిప్ బ్యాగ్‌లో ఉంచితే చాలా కాలం పాటు చెడిపోకుండా ఉంటాయి.

5 / 5
చాలామంది అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఇలా చేస్తే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా తొక్కతీసి గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఐతే ఉల్లిపాయలను 1 రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో ఉంచకూడదు.