Puffy Chapati: చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి

|

Dec 18, 2024 | 9:13 PM

చాలా మంది ఎంత ప్రయత్నించినా చపాతీ మెత్తగా చేయడం వారి వళ్ల అవ్వదు. దీంతో చపాతీ గట్టిగా రావడంతో పిల్లలు, పెద్దవాళ్లు వాటిని తినలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి గృహిణులకు చక్కని పరిష్కారం ఉంది. అదేంటంటే చపాతీ పిండి కలిపేటప్పుడు అందరి మాదిరిగానే మీరూ ఈ తప్పు చేస్తే చపాతీ గట్టిగా వస్తుంది. అలా రాకూడదంటే..

1 / 5
డైట్ ఫుడ్స్‌లో చపాతీ ఒకటి. చాలా మంది ఆహారంలో చపాతీ తప్పనిసరిగా ఉంటుంది. ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు చపాతీలు తప్పకుండా తింటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెత్తని చపాతీలు తయారు చేయడం చేతకాదు. అయితే చపాతీలు మెత్తగా రావాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
పిండిని బాగా పిసికి కలుపుకోవడానికి మంచి పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పిండిని మెత్తగా చేయడానికి ఎప్పుడూ చిన్న గిన్నెని ఉపయోగించవద్దు. కొంచెం వెడల్పుగా, సులభంగా హ్యాండిల్ చేయగల కంటైనర్‌ను ఎంచుకోవాలి.

3 / 5
చపాతీ పిండిని మెత్తగా కలుపుకోవాలంటే చాలా మంది చల్లటి నీటిని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు నీటి పరిమాణం ఎక్కువ లేదా తక్కువ అయినా చపాతీ గట్టిగా మారవచ్చు. నీరు తక్కువగా ఉంటే పిండి గట్టిగా ఉంటుంది. దీంతో చపాతీ మెత్తగా రాదు. కాబట్టి గోరువెచ్చని నీటిని ఉపయోగించి పిండిని పిసికి కలుపుకోవాలి. ఇలా చేస్తే చపాతీ మెత్తగా ఉబ్బుతుంది.

4 / 5
 నీటి పరిమాణంలో తేడా వల్ల చపాతీ పిండి మెత్తగా మారుతుంది. నీళ్లు ఎక్కువైనట్లు అనిపిస్తే కొందరు అందులో మళ్లీ గోధుమపిండి వేసి బాగా కలుపుతారు. ఇలా చేస్తే చపాతీ మెత్తగా రాదు. పిండిలో నీటిశాతం ఎక్కువగా ఉంటే వెంటనే అందులో నూనె రాసి మళ్లీ మెత్తగా కలుపుకోవాలి.

5 / 5
ఉదయం అల్పాహారంగా చపాతీ చేయడానికి తొందరగా పిండిని పిసికి చేసేస్తారు. దీంతో చపాతీ గట్టిపడుతుంది. కనీసం 10 నిమిషాలు పిండిని బాగా కలపాలి. బాగా మెత్తగా కలిపితేనే చపాతీ గుండ్రంగా మెత్తగా వస్తుంది. మిక్సింగ్ తర్వాత వెంటనే చపాతీ చేయవద్దు. పిండిని అరగంట అలాగే ఉంచడం మంచిది. లేదంటే చపాతీ పిండిని రాత్రి కలుపుకుని అలాగే ఉంచి, ఉదయాన్నే చపాతీలు సులభంగా చేసుకోవచ్చు.