Kitchen Hacks: సబ్బు లేకుండానే వంటపాత్రలను శుభ్రం చేయొచ్చు.. అద్భుతమైన ఈ టిప్స్‌తో పాత్రలన్నీ తళుక్కుమంటాయి..

|

Apr 02, 2023 | 11:58 AM

మనలో చాలా మంది ఇంట్లోని వంట పాత్రల కోసం డిష్‌వాషింగ్ సబ్బులు, ఇతర లిక్విడ్స్ ఉపయోగిస్తుంటారు. అయితే అవి రసాయనాలతో తయారవుతాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకావం ఉంది. అందువల్ల రసాయనాలు లేకుండా పాత్రలు శుభ్రపరిచేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి.

1 / 6
వంట పాత్రలను కడగడానికి సాధారణంగా సబ్బులు లేదా లిక్కిడ్‌లు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి మన పూర్వీకులు తమ పాత్రలను ఎలా శుభ్రం చేసుకునేవారు..? ఎప్పుడైనా ఆలోచించారా..? వారు రసాయనాలతో చేసిన సబ్బులతో కాకుండా సాధారణ చిట్కాలను ఉపయోగించి తమ పాత్రలను శుభ్రపరిచేవారు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..

2 / 6
నిమ్మరసం: నిమ్మరసం ఆరోగ్యానికే కాక పాత్రలను శుభ్రంగా ఉంచడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పాత్రలపై ఉండే సూక్ష్మ జీవులను సమూలంగా నిర్మూలించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు 4, 5 టీ స్పూన్ల బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి బాగా కలిపితే చాలు. తర్వాత ఆ పేస్ట్‌తో పాత్రలను కడగవచ్చు.

3 / 6
బియ్యం నీరు: జిడ్డుగల వంట పాత్రలను శుభ్రం చేయడంలో బియ్యం నీరు ఎంతగానో సహాయపడుతుంది. అందుకోసం ఒక గిన్నెలో కొంచెం బియ్యం నీళ్ళు తీసుకుని అందులో మీ డిష్ వాష్ స్పాంజిని ముంచండి. తర్వాత పాత్రలపై స్క్రబ్ చేయండి.. మీ పాత్రలు తలతలా మెరిసిపోతాయి.

4 / 6
బూడిద: పురాతన కాలంలో ప్రజలకు డిష్ వాష్ సబ్బులు అందుబాటులో లేనప్పుడు, వారు తమ పాత్రలను శుభ్రం చేయడానికి కలప(ఎండిపోయిన చెట్లు) బూడిదను ఉపయోగించారు. బూడిద నుంచి సహజమైన డిష్ వాషింగ్ పౌడర్ తయారు చేయవచ్చు. మీకు గుర్తుండి ఉంటే.. ఈ పద్ధతిని మన చిన్నతనంలో చూసే ఉంటాం.

5 / 6
బేకింగ్ సోడా: బేకింగ్ సోడాతో కూడా వంట పాత్రలను కడగవచ్చు. అందుకోసం వంట పాత్రలను కడగడానికి ముందు వాటిని వేడి నీటిలో ఉంచండి. తరువాత వంట పాత్రలలో బేకింగ్ సోడాను చల్లి, 5 నుంచి 10 వదిలివేయండి. తర్వాత స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌తో వాటిపై రుద్ది కడగండి.. పాత్రలపై జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది.

6 / 6
టమాటో తొక్క: టమాటో తొక్కలతో వంట పాత్రలను తొమితే అవి బాగా శుభ్రపడి తలతలా మెరిసిపోతాయి. అందుకోసం టమోటా పై తొక్కతో వంటపాత్రలను రుద్దండి, ఆపై 10 నుంచి 15 నిమిషాలు వదిలివేయండి. తర్వాత నీటితో కడిగితే చాలు.