- Telugu News Photo Gallery Kitchen Hacks: Clean gas burners in shortest time, check here is details in Telugu
Kitchen Hacks: అతి తక్కువ సమయంలోనే గ్యాస్ బర్నర్స్‌ని ఇలా క్లీన్ చేసేయండి!
కిచెన్ క్లీన్ చేయాలంటే.. చాలా కష్టం. ఎంత చేసినా.. ఎక్కడో ఓ మూల ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అందులోనూ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే పెద్ద టాస్కే. మరకలతో త్వరగా క్లీన్ కాదు. ఎంత తోమినా.. జిడ్డుగానే అనిపిస్తుంది. అందులో గ్యాస్‌పై ఉండే గ్యాస్ బర్నర్స్ క్లీనింగ్ అంటే చాలా కష్టం. అందుకే కొన్ని సులభమైన టిప్స్ మీకోసం. అప్పుడే గ్యాస్ స్టవ్ తలతలమని మెరిసిపోతుంది. కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిచెన్ శుభ్రంగా ఉంటేనే..
Updated on: Jan 27, 2024 | 1:51 PM

కిచెన్ క్లీన్ చేయాలంటే.. చాలా కష్టం. ఎంత చేసినా.. ఎక్కడో ఓ మూల ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అందులోనూ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే పెద్ద టాస్కే. మరకలతో త్వరగా క్లీన్ కాదు. ఎంత తోమినా.. జిడ్డుగానే అనిపిస్తుంది. అందులో గ్యాస్‌పై ఉండే గ్యాస్ బర్నర్స్ క్లీనింగ్ అంటే చాలా కష్టం. అందుకే కొన్ని సులభమైన టిప్స్ మీకోసం. అప్పుడే గ్యాస్ స్టవ్ తలతలమని మెరిసిపోతుంది.

కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిచెన్ శుభ్రంగా ఉంటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందే గ్యాస్ స్టవ్‌ని శుభ్రం చేస్తారు. కానీ గ్యాస్ బర్నర్ ప్రతి రోజూ శుభ్రం చేయడం కష్టం. అది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే దాన్ని అప్పుడప్పుడూ క్లీన్ చేస్తారు.

ఈ గ్యాస్ బర్నర్ క్లీన్ చేయడం అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే దాని రంధ్రాల్లో ధూళి అనేది పేరుకుతుంది. దీంతో మంట కూడా సరిగా రాదు. గ్యాస్ లీకైనట్టు దుర్వాసన కూడా వస్తుంది. అలా కాకుండా గ్యాస్ బర్నర్‌ను తక్కువ సమయంలోనే క్లీన్ చేయవచ్చు.

గ్యాస్ బర్నర్ క్లీన్ చేయాలంటే.. ముందుగా ఒక పాత్రలోకి వేడి నీటిని తీసుకోవాలి. ఇందులో ఇనో, నిమ్మ రసం కలపాలి. ఇందులో గ్యాస్ బర్నర్‌లను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి.

ఇలా చేస్తే బర్నర్‌లపై ఉండే కొంత జిడ్డు, మురికి కాస్త పోతుంది. ఆ తర్వాత ఓ పాత బ్రష్ తీసుకుని.. ఈ లిక్విడ్‌తో బర్నర్‌లను రుద్దితే.. రంధ్రాల్లో ఉండే మురికి అంతా పోతుంది. దీంతో మంట కూడా పెద్దగా వస్తుంది.




