
చాలా మంది సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏదంటే జపాన్ అని చెబుతారు. కానీ ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. భూమి అనేది ఒక పెద్ద గ్రహం ఇది.. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ భ్రమణం కారణంగా సూర్యుడు ఒక్కో సమయంలో ఒక్కో ప్రదేశంలో ఉదయిస్తాడు. అయితే తొలుత ఉదయించే ప్రాంతం విషయానికి వస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మిలీనియం అనే దీవితో తొలుత సూర్య కిరణాలు పడుతాయి. ఈ దీవులు కిరిబాటి అనే దేశంలో ఉంటాయి.

సూర్యుడు తొలుత ఉదయంచే ఈ కిరిబాటి దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది అత్యంత మారుమూల వివిక్త దేశాలలో ఒకటి.. ఇక్కడ ఎక్కువ శాతం అడువులే ఉంటాయి. అలాగే 3.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 33 పగడపు దిబ్బలు విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనుషులు జీవించరు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కిరిబాటి దేశం భూమధ్యరేఖ, అంతర్జాతీయ తేదీ రేఖ రెండింటినీ దాటుతుంది. దేశంలో తూర్పు దిక్కున ఉన్న బిందువు, మిలీనియం ద్వీపంలో ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి కొన్ని నివేదికల ప్రకారం.. ప్రపంచంలో సూర్యుడు ఉదయించే భూమిగా ఈ ప్రాంతం పిలువబడుతుంది.

అయితే కొందరు శాస్త్రవేత్తల ప్రకారం.. ప్రపంచంలో మొదట సూర్యుడు ఉదయించేది ఒకే చోట కాదని చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణిస్తున్న క్రమంలో ప్రతి క్షణం భూమి మీద ఎక్కడో ఒక చోట ఉదయిస్తూనే ఉంటాడని వారు భావిస్తున్నారు. అందుకే సూర్యుడు మొదటి లేదా చివరి ఉదయించే ప్రాంతం ఉండదని అంటున్నారు.

అయితే ఈ కిరిబాటి ఒక అందమైన దేశం అయినప్పటికీ ఇక్కడ జనాలు చాలా తక్కువ మొత్తంలో జీవిస్తారు, ఎందుకంటే వాతావరణ మార్పులకు అత్యంత హాని కలిగించే దేశాలలో ఇది ఒకటి. భారీ వర్షాలు వంటివి సంభవించినప్పుడు సముద్ర మట్టాలు పెరగడంతో, కేవలం రెండు మీటర్ల ఎత్తులోనే ఈ దీవులు మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం జనాలు నివసించరు.