లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..పిల్లలు మెచ్చే బ్రెడ్ ఆమ్లేట్.. ఇలా చేస్తే అదిరిపోద్దీ?

Updated on: Jun 24, 2026 | 4:24 PM

పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే చాలా సులభంగా చేయగలిగే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడితే, పిల్లలు ఇష్టంగా తింటారు. కాగా, దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్  3,   గుడ్లు 4,  బటర్ లేదా నూనె తగినంత,   సన్నగా తరిగిన ఉల్లిపాయ  1/4 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2,   సన్నగా తరిగిన టమాటా  1/4 కప్పు,  సన్నగా తరిగిన కొత్తిమీర  కొద్దిగా,   ఉప్పు, రుచికి సరిపడా,   పసుపు 1/4 టీ స్పూన్,  జీలకర్ర పొడి  1/4 టీ స్పూన్, ధనియాల పొడి  1/2 టీ స్పూన్, కారం  తగినంత,  చాట్ మసాలా  1/4 టీ స్పూన్ .

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. అందులో కొంచెం నూనె లేదా బటర్ వేసి, బ్రెడ్ ముక్కలను మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వలన రంగు మారడమే కాకుండా తిన్నా కొద్ది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
ఇప్పుడు గుడ్డు మిశ్రమం తయారు చేసుకోవాలి. నాలుగు కోడి గుడ్లను తీసుకోవాలి. తర్వాత వాటిని పగలగొట్టి, ఒక గిన్నెలో ఆ మిశ్రమం వేయాలి. నురగ  వచ్చే వరకు మిశ్రమాన్ని రెండు వైపులా మంచిగా కలుపుతూ ఉండాలి. దీని వలన ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇందులోకి కారం, మసాలా యాడ్ చేయాలి.

4 / 5
 మంచిగా బీట్ చేసుకున్న ఈ గుడ్డు మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వేయండి. తరువాత, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి,   తగినంత కారం కలపాలి. స్ట్రీట్ స్టైల్ రుచిని పొందాలనుకుంటే, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చును. ఈ పదార్థాలన్నిటినీ గుడ్డు మిశ్రమంలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి.

5 / 5
ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి. ఒక పాన్ పెట్టి, దానిపై కొంచెం నూనె సమానంగా రాయాలి. అది కాస్త వేడిగా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని పాన్ పై సమానంగా వేయాలి. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ను ఈ గుడ్డు మిశ్రమంలో ఒక వైపు కొద్దిగా డిప్ చేసి, వెంటనే ఆమ్లెట్ మధ్యలో ఉంచండి. బ్రెడ్ పై భాగంలో కూడా కొద్దిగా గుడ్డు మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేయాలి. రెండు నిమిషాలు, ఉడికేలా చూసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.

Follow Us