
అయితే గ్రహాల్లోకెల్లా శక్తివంతమైన బృహస్పతి గ్రహాం సంచారం చేయనుంది. అక్టోబర్ 19న ఇది గ్రహ సంచారం చేయనుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లాబంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మీన రాశి : మీన రాశి వారికి బృహస్పతి సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగుటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుటుంది. బృహస్పతి సంచారం వలన అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి బృహస్పతి సంచారం వలన అనేక ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారు అప్పుల ఊబి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఈ సమయంలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.