
12 ఏళ్ల తర్వాత గురు గ్రహం తన కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. అక్టోబర్ నెలలో గురు సంచారం ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతంగా ఉండబోతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

కర్కాటక రాశి : గురు గ్రహం సంచారం వలన కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి మీకు లాభదాయకంగా ఉంటాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి 12 ఏళ్ల తర్వాత గురు గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ నెరవేరుస్తారు.

తుల రాశి : తుల రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతం అని చెప్పాలి. అక్టోబర్ నెల మొత్తం వీరికి బాగుంటుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వ్యాపరస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం వలన చాలా బాగుంటుంది. వీరికి గురు గ్రహ మార్పు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది.