
ఈ రోజుల్లో జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. గోధుమ రొట్టె కంటే దీన్నే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. జొన్న రొట్టెలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులు దరికి చేరకుండా చేస్తాయని భావిస్తారు.

అయితే, కొంతమంది మాత్రం జొన్న రొట్టెను పూర్తిగా నివారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు, అంటే కడుపునొప్పి, అసిడిటీ, గ్యాస్, పేగు సిండ్రోమ్ వంటివి ఉన్నవారు దీనిని తినడం వల్ల వారి సమస్యలు తీవ్రతరం కావచ్చు.

మధుమేహంతో బాధపడేవారు కూడా జొన్న రొట్టెను మితంగా తీసుకోవాలి. ఇందులో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని తినడం మంచిది.

అదేవిధంగా, గుండెల్లో మంట, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా జొన్న రొట్టెను తమ ఆహారంలో చేర్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అయినప్పటికీ, కొన్ని పరిస్థితులలో ఇది హానికరం కావచ్చని అంటున్నారు.

అలాగే ఏ ఆహారమైనా శరీరానికి మితంగా తింటే ఏ అనారోగ్య సమస్యలు తలెత్తవని.. అధికంగా తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని.. అందుకే తినే ఫుడ్ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీ డైట్‌లోకి ఏదైనా ఆహారాన్ని జత చేస్తే కచ్చితంగా వైద్యున్ని ముందుగా సంప్రదించాలన్నారు.