
అంబనీ కుటుంబానికి చెందిన మహిళల ఆభరణాలను చూస్తే కళ్లు మిరిమిట్లు గొలపటం ఖాయమనే చెప్పాలి. వారి ఆభరణాల ఖచ్చితమైన ధర ఎంత ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ తగిలినంతపనవుతుంది.

నీతా అంబానీకి చెందిన ఎన్‌ఎంఎసిసి ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన నగలు చర్చనీయాంశమయ్యాయి.

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన డైమండ్ రింగ్ విలువ రూ.40 కోట్లు. వజ్రాలు దాదాపు 80 నుండి 90 క్యారెట్లు ఉంటాయి.

ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రారంభోత్సవ వేడుకలో ధరించిన డైమండ్ నెక్లెస్ విలువ రూ.200 కోట్లు అని సమాచారం.

నీతా అంబానీ తన కోడలు శ్లోకా మెహతాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ నెక్లెస్ ధర 450 కోట్ల రూపాయలు.

ఈ డైమండ్ నెక్లెస్ పెడంట్ పసుపు రంగులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే స్వచ్ఛమైన వజ్రంగా సమాచారం.