
ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో పలు ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. పైగా పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.

గుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచాలంటే: సుమారు నెల రోజుల పాటు ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ ఉంచవచ్చు. అదే బయటైతే మాత్రం ఒక వారం పాటు ఉండవచ్చు. అంతకుమించి నిల్వ ఉంచితే మాత్రం గుడ్లు చెడిపోతాయి.

పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తించాలి: పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డు పగులగొట్టి వాసన చూడండి. రెగ్యులర్ స్మెల్ కాకుండా చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్లు పాడైపోయినట్లే.

నీటిలో ముంచడం: చాలా రోజుల పాటు గుడ్లను నిల్వ ఉంచి అవి బాగున్నాయా? లేదా? అని గుర్తించాలంటే ఓ సింపుల్ చిట్కాను అనుసరించవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో గుడ్డును ముంచండి. గుడ్డు నీటిలో మునిగినట్లయితే అది మంచిగా ఉన్నట్లే. ఒకవేళ గుడ్డు నీటితో తేలితే మాత్రం అది పాడైపోయినట్లే నని భావించాలి. అదేవిధంగా గుడ్డు నీటిలో నిటారుగా నిలబడినా అది చెడిపోయినట్లే.

పాడైపోయిన గుడ్లను ఇంకోలా కూడా గుర్తుపట్టవచ్చు. ఇందుకోసం గుడ్డును చెవి దగ్గర ఉంచుకుని షేక్ చేయాలి. రెగ్యులర్‌గా కాకుండా గుడ్డు నుంచి శబ్దాలు వస్తుంటే మాత్రం అది పాడైపోయినట్లేనని గ్రహించాలి. గుడ్లలో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే చెడిపోయిన గుడ్లను తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.