Watermelon: ఏంటీ పుచ్చకాయను ఉప్పుతో తింటున్నారా? అయితే ఆ సమస్యలకు ఆహ్వానం పలికినట్టే!

Updated on: Feb 20, 2026 | 9:14 PM

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలూ మామిడి, పుచ్చకాయలకు ఎక్కడ లేని గిరాకి వస్తుంది. ఎందుకంటే వేసవిలో దొరికే ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే పుచ్చకాయ తినే విషయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. జనాలు పుచ్చకాయపై ఉప్పును చల్లుకొని తింటారు. కానీ ఇది చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి పుచ్చకాయ మీద ఉప్పు చల్లుకొని తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

1 / 5
పుచ్చకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. దీనిలో 90 శాతం కంటే ఎక్కువ నీరే ఉంటుంది. అందువల్ల, ఇది నిర్జలీకరణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో చెమట ద్వారా పోగొట్టుకునే ద్రవాలను భర్తీ చేయడంలో ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో పొటాషియం ఉండటం వల్ల శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. వ్యాయామం దీన్ని తర్వాత తీసుకుంటే కండరాల నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
పుచ్చకాయలో సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. దానికి ఉప్పు కలపడం వల్ల సోడియం స్థాయిలు పెరుగుతాయి. కొద్దిగా ఉప్పు పెద్ద విషయం కాకపోయినా, క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, వాపు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి గ్యాస్, ఆమ్లత్వం, వికారం వంటి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు

3 / 5
అధిక రక్తపోటు, గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఉప్పు పుచ్చకాయను తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, అలాంటి వారు సహజంగా పుచ్చకాయ తినడం మంచిది. రుచికి ఉప్పు జోడించడం తప్పనిసరి కాదు.

4 / 5
పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే, అధిక ప్రోటీన్ కలిగిన మాంసం లేదా గుడ్లు తిన్న వెంటనే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పండ్లను కోసి ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే పోషకాలు తగ్గవచ్చు. కోసిన వెంటనే తినడం మంచిది.

5 / 5
పుచ్చకాయను మితంగా తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. చక్కెర లేదా ఎక్కువ ఉప్పుతో తినకుండా ఉండటం కూడా మంచిది. మీకు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ ఆహారం గురించి వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి..వీటిని TV9 దృవీకరించట్లేదు)

Follow Us