Goa Liquor: గోవా నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చేప్పుడు ఎంత మద్యం తీసుకురావొచ్చు..?

|

Mar 26, 2023 | 12:42 PM

గోవాలో మద్యం చాలా చౌకగా దొరుకుందన్న విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లి వచ్చేటప్పుడు మీరు ఎంత మద్యం తీసుకురావొచ్చనే విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇక్కడ మీరు వచ్చే రాష్ట్రం తాలూకా నిబంధనలు కూడా తెలుసుకోవాలి. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

1 / 5
ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ గోవా లిక్కర్‌ను అస్సలు అనుమతించరు. వేరే రాష్ట్రం నుంచి ఒక్క లిక్కర్ బాటిల్‌ను కూడా తెచ్చే వీలు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

2 / 5
అనుమతి ఉన్న రాష్ట్రాలకు అయితే.. రోడ్డు మార్గంలో అయితే గోవా రూల్స్ ప్రకారం 2 ఫుల్ బాటిల్స్ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే అథారిటీ కలిగిన డీలర్ లేదా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి 20 రూపాయలు( ఒక్కో బాటిల్‌కు 10) చెల్లించి తీసుకున్న పర్మిట్ స్లిప్ అవసరం ఉంటుంది.

3 / 5
గోవా నుండి మహారాష్ట్రకు, కర్ణాటకకు రోడ్డు మార్గం ద్వారా ఒక్క లిక్కర్ బాటిల్‌ను కూడా తీసుకెళ్లడానికి వీలులేదు. ఈ 2 రాష్ట్రాలు గోవాకు బోర్డర్‌ల ఉన్నందున అక్రమ మద్యం రవాణాను నిలువరించేందుకు ఆయా స్టేట్ గవర్నమెంట్స్ ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి గోవా రోడ్డు మార్గంలో వెళ్లి వచ్చేవారు ఈ స్టేట్స్ నుంచే ప్రయాణించాలి కాబట్టి.. మీరు లిక్కర్ తెచ్చేందుకు అస్సలు వీలు కుదరదు.

4 / 5
గోవా నుంచి హైదరాబాద్‌కు విమానంలో అయితే ఒక్కో వ్యక్తి 5 లీటర్ల లిక్కర్‌ను చెక్‌ఇన్ బ్యాగేజ్‌లో తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ హ్యాండ్ బ్యాగేజ్‌‌లో మాత్రం అస్సలు అనుమతి ఉండదు.

5 / 5
కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూతో పాటు పంజాబ్,  మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఒడిశా, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్,హిమాచల్‌ రాష్ట్రాలకు రోడ్డు మార్గం ద్వారా పర్మిట్ తీసుకుని మీరు 2 బాటిల్స్ తీసుకెళ్లవచ్చు.