
గుడ్లు తినడం గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు గుడ్లు ఎక్కువగా తినడం మంచిది కాదని అంటారు. మరికొంతమంది, ఎక్కువ గుడ్లు తినమని అంటారు.

కాబట్టి ప్రతిరోజూ ఒక గుడ్డు నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ పరిశోధన ప్రకారం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గుడ్డులోని పచ్చసొన తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. గుడ్డులోని తెల్లసొనకు లేకుండా తినవచ్చని తెలపారు.

అలాగే గుడ్లను ఎల్లప్పుడూ వేయించకూడదు. ఎందుకంటే నూనెలో వేయించిన గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరుగుతాయి. అందువల్ల, గుడ్లను ఎల్లప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్ళకు, మెదడుకు చాలా మంచిది.

అయితే గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇది శరీరానికి చాలా హానికరమని కూడా అంటుంటారు. అయితే, గుడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

గుడ్డు క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి వారానికి 6 గుడ్లు సురక్షితంగా తినవచ్చు. అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ తినవద్దు. బదులుగా, ప్రతిరోజూ మీ ఆహారంలో ఒక గుడ్డును చేర్చుకోవచ్చు. వేయించినా, ఉడకబెట్టినా, ఆమ్లెట్ వేసినా.. ఏకంగా తీసుకున్నా గుడ్లు శరీరానికి మేలు చేస్తాయి.