
కాఫీ ఇప్పుడు చాలా మంది ఫేవరెట్ అయ్యింది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగే వారు చాలా మంది ఉంటారు. మైండ్ ఫ్రెస్ అవ్వడానికి అదే విధంగా అలసట తగ్గించుకోవడానికి చాలా మంది ఎక్కువగా కాఫీ తాగుతుంటారు.

ఇక రోజుకు కొంత మంది ఒకసారి తాగితే మరికొంత మంది రోజుకు రెండు లేదా, మూడు సార్లు తాగుతుంటారు. ఇక కొందరు రోజూ ఉదయం తాగితే మరికొందరు రాత్రి సమయంలో తాగుతుంటారు. మరి రాత్రి సమయంలో టీ తాగడం మంచిదేనా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాగా, దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అయితే రాత్రి సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలో ఉండే క్యాఫైన్ అనే పదార్థం అది వ్యక్తి మానసిక, శారీరక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. దీని వలన నిద్రలో ఆటకం కలగడం, నిద్రలేమి సమస్య ఏర్పడుతుందంట.

రాత్రి కాఫీ తాగినట్లయితే, నిద్ర త్వరగా రావడం కష్టమవ్వడం లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.దీనికారణంగా మరసటి రోజు అలసట, దృష్టి లోపం, పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని అందుకే రాత్రి సమయంలో టీ తాగకూడదంటున్నారు వైద్య నిపుణులు.

ఇవే కాకుండా రాత్రి సమయంలో కాఫీ తాగడం వలన ఆందోళన, గుండె ఊపిరితిత్తుల రేటు పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు ఉబ్బరం, గ్యాస్ ,ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయంట.