మీరు ఆధ్యాత్మిక పరంగా విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా? అందులోనూ శ్రీలంకను సందర్శించాలని భావిస్తున్నారా? మీకోసమే.. ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ట్యూర్ ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ఖర్చుతోనే రామాయణ యాత్రను చేసి రావొచ్చు.
ఐఆర్‌సీటీసీ టూరిస్టుల కోసం రామాయణంలోని విశేష ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక టూర్ ప్లాన్‌ను రూపొందించింది. ఐఆర్‌సీటీసీ శ్రీలంక పర్యటనకకు రామాయణ యాత్ర అని పేరు పెట్టింది.
ఈ టూర్ 5 పగళ్లు, 4 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ కింద మొదటి రోజు ఢిల్లీ విమానాశ్రయం నుండి కొలంబోకు బయలుదేరుతారు. ఆ తరువాత ఇక్కడ నుండి నువారా ఎలియాకు వెళతారు.
ఈ టూర్ 5 పగళ్లు, 4 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ కింద మొదటి రోజు ఢిల్లీ విమానాశ్రయం నుండి కొలంబోకు బయలుదేరుతారు. ఆ తరువాత ఇక్కడ నుండి నువారా ఎలియాకు వెళతారు.
మూడవ రోజు.. హనుమాన్ ఆలయం, మతపరమైన ప్రదేశాలే కాకుండా, అనేక ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించొచ్చు. నాల్గవ రోజు కొలంబోకు ప్రయాణం ఉంటుంది. కొలంబోలోని పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని, ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు.
అన్ని ప్రదేశాలను సందర్శించిన తర్వాత మిమ్మల్ని కొలంబో విమానాశ్రయానికి తీసుకువస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
ఈ టూర్ ప్యాకేజీ కింద రూ.58,500 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో బస, భోజనం, అల్పాహారం ఏర్పాట్లు ఉన్నాయి.