- Telugu News Photo Gallery IPL 2022: BCCI felicitates Neeraj Chopra and Other Medal winners from Toyo Olympics before CSK vs KKR match
IPL 2022: టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ ఘన సన్మానం.. నీరజ్‌కు రూ. కోటి రివార్డు..
గత ఏడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 7 పతకాలతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు భారత ఆటగాళ్లు.
Updated on: Mar 27, 2022 | 4:27 PM

టోక్యో ఒలింపిక్స్ విజేతలను బీసీసీఐ ఘనంగా సన్మానించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల చెక్కును అందించారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చేతుల మీదుగా కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఈ చెక్కును అందుకున్నాడు.

భారత యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌ను కూడా బీసీసీఐ సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆమెకు రూ. 25 లక్షల నజరానా అందించింది బీసీసీఐ.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో CSK VS KKR మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ టోక్యో ఒలింపిక్స్ విజేతలను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ లో భారత్‌కు మొదటి బంగారు పతకం తీసుకొచ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు రూ. కోటి నజరానా అందించింది.

బీసీసీఐ శనివారం (మార్చి 26) IPL 2022 ప్రారంభానికి ముందు టోక్యో ఒలింపిక్స్ విజేతలను సత్కరించింది. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సహా పలువురు క్రీడాకారులకు నజరానాలు అందించారు. బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ షా, ఐపీఎల్ కమిషనర్ బ్రిజేష్ పటేల్‌తో సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




