India’s 1st Village: దేశంలోని మొదటి గ్రామంలో ఎన్ని ప్రకృతి అందాలో.. సహస, ఆధ్యాత్మిక యాత్రలకు అద్దిరిపోయే గమ్యస్థానం..

|

Apr 26, 2023 | 6:43 AM

మన భారతదేశం సువిశాల దేశం. సందర్శించేందుకు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మన దేశానికి మొదటి గ్రామమైన మనా విలేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఉత్తరాఖండ్‌లోని మనా గ్రామం ఇకపై చివరి గ్రామంగా కాకుండా దేశానికి మొదటి గ్రామంగా పరిగణించబడుతుంది. ఇటీవల, ఈ గ్రామ సైన్ బోర్డును సరిహద్దు రహదారి సంస్థ మార్చింది. అలా దేశానికి మొదటి గ్రామంగా మారిన మనా గ్రామంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సందర్శనాత్మకంగా ఉండే ఈ ప్రదేశాలకు నిత్యం అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. మరి మీరు కూడా సందర్శించాలనుకుంటే.. ఇక్కడ ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలేమిటో ఇప్పుడు చూద్దాం..

2 / 5
నీలకంఠ శిఖరం: నీలకంఠ శిఖారానికే ‘గర్హ్వాల్ రాణి’ అని కూడా పేరు. ఈ శిఖరం నుంచి మీరు బద్రీనాథ్ ధామ్ అందంతో పాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలను చూడవచ్చు. బ్రహ్మకమల్ వంటి అదుదైన పుష్పాలను కూడా మీరు ఇక్కడ చూడగలరు. సాహసయాత్రలను ఇష్టపడే వారికి ఇది మంచి ప్రదేశం.

3 / 5
తప్ట్ కుండ్: మనా గ్రామంలోని ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి ఔషధ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఈ ప్రదేశాన్నే అగ్నిదేవుని నివాసంగా కూడా పరిగణిస్తారు. ఇందులో ఉండే నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుందని, అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. ఆ కారణంగానే చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడాలనుకునే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

4 / 5
మాతా మూర్తి ఆలయం: అలకనంద నది ఒడ్డున ఉన్న మాతా మూర్తి ఆలయం అతి పురాతన దేవాలయం. శ్రీమహావిష్ణువు అవతారంగా పరిగణించబడే నరనారాయణుల మాతృ‌మూర్తి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరను చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

5 / 5
వసుధార జలపాతం: ఈ వసుధార అందమైన జలపాతం చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. జలపాతం నుంచి జారుతున్న నీటి బిందువులు ముత్యాల్లా కనిపిస్తున్నాయి. మీరు మనా గ్రామానికి వెళుతున్నట్లయితే, ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. ఇదే కాకుండా ఇక్కడే మీరు వ్యాస్ గుఫా(వ్యాసుడి గుహ), గణేష్ గుఫా,  భీమ్ కుండ్ వంటి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.