
చికెన్‌తో తయారు చేసే డిషెస్‌లో చికెన్ 65 దేశంలో చాలా పాపులార్. పెద్ద పెద్ద పట్టణాలు మొదలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా చికెన్ 65 లభిస్తుంది. కేవలం రెస్టారెంట్స్‌లో మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఈ డిష్‌ను ప్రిపేర్ చేసుకుంటారు. తక్కువ సమయంలో ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం.

ఇటీవల ఓ ఫుడ్ గైడ్ నిర్వహించిన సర్వేలో చికెన్ 65 టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. చికెన్‌తో తయారు చేసే డిషెస్‌లో చికెన్ 65 ప్రపంచంలోనే 10వ స్థానంలో నిలిచింది. ఇండోనేషియాకు చెందిన అయామ్ గొరెంజ్ డిష్ 4.6 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

రెండో స్థానంలో 4.5 రేటింగ్‌తో తైవాన్ పాప్ కార్న్ చికెన్ నిలవగా, మూడో స్థానంలో సౌత్ అమెరికాకు చెందిన సౌత్ ఫ్రైడ్ చికెన్ నిలిచింది. ఇక నాల్గో స్థానంలో చైనాకు చెందిన క్రిస్పీ చికెన్, 5వ స్థానంలో ఇండోనేషియాకు చెందిన అయామ్ పెన్‌యెట్ ఉంది.

6వ స్థానంలో రష్యాకు చెందిన జరాక్సయ కొట్లెటా, 8వ ప్లేస్‌లో ఆస్ట్రేలియా డిష్ స్థానం దక్కించుకుంది. ఇక 9వ స్థానంలో అమెరికా ఫుడ్ హాట్ చికెన్ చోటు దక్కించుకోగా 10వ స్థానంలో ఇండియన్ ఫుడ్ చికెన్ 65 నిలిచింది.

చికెన్ 65 తయారీ విధానం.. ముందుగా చినెక్‌ను తీసుకొని నీటిలో గంటపాటు నానబెట్టాలి. తర్వాత చికెన్‌లో ఎగ్, ఉప్పు, కారం, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి ముక్కలకు కలిసేలా బాగా కలపాలి. అనంతరం కడాయిలో నూనె వేయించుకొని సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను బాగా వేయించాలి.

అనంతరం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేయాలి. అనంతరం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర వేసి నిమిషం పాటు వేయించి స్టౌవ్ ఆఫ్ చేయాలి. అనంతరం కాస్త పెరుగు, నిమ్మరసం కలపాలి. తిరిగి స్టౌవ్ ఆన్ చేసి అప్పటికే సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకొని బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ 65 రడీ.