అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో విదేశీయులను సైతం ఆకర్షించే మన దేశంలోని ఈ ప్రదేశాలు పర్యటనకు బెస్ట్ ఎంపిక..

Updated on: Oct 14, 2023 | 11:26 AM

భారతదేశం చరిత్ర, సంస్కృతితో చాలా అందమైన దేశం. భిన్నత్వంతో ఏకత్వంగా కనిపించే నిండైన మన దేశంలోని అందాలను చూసేందుకు విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. అన్ని రకాల ప్రత్యేకమైన, అద్భుతమైన, అందమైన దృశ్యాలను కలిగి ఉన్న దేశంలో అనేక ప్రాంతాలు విదేశీయులను కూడా ఆకర్షిస్తూ ఉంటాయి

1 / 5
మీరు కూడా దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. భారత దేశంలో కొన్ని అందమైన ప్రదేశాలు పర్యటనకు బెస్ట్ ఎంపిక. సందర్శించిన తర్వాత అక్కడ నుంచి తిరిగి రావాలని అనిపించదు. అంతేకాదు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటారు.. కనుక ఈ రోజు ఈ అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 

2 / 5

కేరళ: కేరళ భారతీయులకే కాకుండా విదేశీ పర్యాటకులకు కూడా అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సహజమైన బీచ్‌లు, ఆయుర్వేద రిసార్ట్‌లు , స్పాలు విదేశీ యాత్రికులకు ప్రధాన ఆకర్షణలు. అంతేకాదు కేరళలోని బ్యాక్ వాటర్స్ ను కూడా ఆస్వాదించవచ్చు.

3 / 5
కసోల్: కసోల్ పట్టణం సందడిగా ఉంటుంది. చాలా అందమైన ప్రదేశం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనిని ఆమ్‌స్టర్‌డ్యామ్ ఆఫ్ భారత్ అని పిలుస్తారు. కసోల్ బ్యాక్‌ప్యాకర్ ప్రయాణికులకు స్వర్గం కంటే తక్కువ కాదు. హిప్పీ సంస్కృతి, ఓపెన్ హార్ట్ ఉన్న వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారు.

4 / 5
గోకర్ణం: కర్ణాటకలోని ఈ చిన్న ప్రదేశంలో విదేశీయులు ఎక్కువగా పర్యటించడానికి ఆసక్తిని చూపిస్తారు. మీ సెలవులను గడపడానికి అవకాశం ఉంటే తప్పకుండా గోకర్ణాన్ని సందర్శించండి. ఇప్పుడు గోవాతో పాటు చాలా మంది కూడా గోకర్ణాన్ని సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇక్కడ శివాలయం చాలా ఫేమస్. 

5 / 5
ఆగ్రా: ఆగ్రా నగరానికి చేరుకోగానే మీరు ఖచ్చితంగా వావ్ తాజ్ అంటూ చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. తాజ్ మహల్ అందమైన దృశ్యంతో పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో చేర్చబడింది. అనేక దేశాల అధ్యక్షులు తాజ్ మహల్ ను సందర్శించడానికి కూడా ఆసక్తిని చూపిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ ప్రదేశం బెస్ట్ ఎంపిక. 