ఛాతీలో కఫం, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా బాధితులకు తమలపాకు అద్భుతమైన నివారణ. ఇందుకోసం తమల ఆకుపై కొద్దిగా ఆవాల నూనె రాసి, వేడి చేసి ఛాతీపై ఉంచితే రద్దీ తగ్గుతుంది. మీరు కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టవచ్చు, రెండు కప్పుల నీటిలో ఏలకులు, లవంగాల, దాల్చినచెక్క వేసి నీరు సగానికి తగ్గేవరకు మరిగించాలి. ఆపై ఈ ద్రావణాన్ని రోజుకు రెండు, మూడుసార్లు తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్పారు.
తమలపాకులు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాన్ ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాస్తే వెంటనే పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల రసం తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి తమలపాకులు అద్భుతాలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.
భోజనం చేసిన తర్వాత తమలపాకు నమలడం వల్ల మీ జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయి. పాన్ ఆకులు నమలడం వల్ల మీ నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాదు.. దంతాల్లో క్యావిటీస్, దంతక్షయాన్ని అరికట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల కడుపులో కలిగే ఇబ్బందిని తమలపాకు దూరం చేస్తుంది. తమలపాకు నమలడం వల్ల అజీర్ణం, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు.. తమలపాకుని సాధారణంగా మౌత్ ఫ్రెషనర్‌గా పరిగణిస్తారు. తమలపాకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మీ నోటి దుర్వాసనను తొలగిస్తాయి.
శ్వాస సమస్యలు ఉన్నవారు తమలపాకులతో పాటు లవంగాలను నీళ్లలో వేసి బాగా మరిగించి తాగాలి. దీని వల్ల చాలా వరకు ఉపశమనం పొందుతారు. అలాగే, గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా తమలపాకు ఎంతో మేలు చేస్తుంది. తమలపాకు రసం తాగడం వల్ల గుండె జబ్బులకు మేలు చేస్తుంది. తమలపాకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి