
మజ్జిగ: వేసవిలో మజ్జిగ శరీరాన్ని చల్లబరిచేలా చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగుతే చాలామంచిది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.

కొత్తిమీర-దనియాలు: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు కొత్తిమీర, దనియాలు తినడం మంచిది. వీటిని నేరుగా తిన్నా.. లేదా నీటిలో వేసుకొని మరిగించి తాగినా ఛాతీలో మంట తక్షణమే తగ్గుతుంది. మీరు జీలకర్ర కూడా తినవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను వెంటనే అరికడుతుంది.

సోంపు గింజలుమీరు భోజనం తర్వాత జీలకర్ర, మెంతులు కూడా తినవచ్చు. భోజనం తర్వాత జీలకర్ర, మెంతులు కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, ఉబ్బరం, గ్యాస్ తగ్గుతుందని తద్వారా బరువు నియంత్రణలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. చాలా మంది సోంపు గింజలు తినడానికి ఇష్టపడతారు. కొంతమంది రాత్రంతా వీటిని నీటిలో నానబెట్టి ఉదయం ఈ నీటిని తాగుతుంటారు.

పాలు: పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు చల్లటి పాలు తాగితే ఛాతీ మంట, గ్యాస్ట్రిక్ సమస్య త్వరగా తగ్గుతుంది. పాలు తాగేటప్పుడు పంచదార వేయకూడదు.

తులసి: ఆయుర్వేద మొక్క తులసిని.. చాలామంది పూజలల్లో వినియోగిస్తారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తీసుకుంటే మంచిది. ఇది గ్యాస్ట్రిక్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది.