
ఉదయం లేచింది మొదలు.. పడుకునే వరకూ అనేక పనులు ఉంటాయి. ఈ క్రమంలో బ్రెయిన్‌పై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా క్రమంగా మెదడు మొద్దుబారిపోయి.. చురుగ్గా ఉండదు. ఏకాగ్రత కూడా కుదరదు. కానీ కొన్ని పనులను మీరు తరచూ చేస్తూ ఉంటే మాత్రం.. మీ బ్రెయిన్ యాక్టీవ్‌గా మారడమే కాకుండా పవర్ ఫుల్‌గా పని చేస్తుంది.

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల మీ బ్రెయిన్ చాలా యాక్టీవ్ అవుతుంది. ఎక్సర్ సైజ్ వల్ల.. శరీరంలో రక్త సరఫరా తగిన విధంగా ఉండేలా చేస్తుంది. అలాగే పోషకాలు కూడా తగిన స్థాయిలో ఉండేలా చూసుకోండి. నట్స్, చేపలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి బ్రెయిన్ పనితీరును మెరుగు పరుస్తాయి.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సరిగ్గా ఉండి, మీ బ్రెయిన్ యాక్టీవ్‌గా పని చేయాలంటే ధ్యానం కూడా చాలా అవసరం. ధ్యానం చేయడం వల్ల గ్రే మేటర్ పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తికి, ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ గ్రే మేటరే కీలకం.

మీ బ్రెయిన్‌ని యాక్టీవ్‌గా పని చేయడంలో చేసేది నిద్ర కూడా ఒకటి. సరైన నిద్ర లేకపోతే.. మీరు దిగాలుగా, నీరసంగా ఉంటారు. దీంతో మెదడుపై ఒత్తిడి అనేది బాగా పడుతుంది. నిద్ర పోవడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తుంది.

బ్రెయిన్‌కి ఎప్పుడూ పని చెప్తూ ఉండాలి. ఏదైనా పజిల్స్, కొత్తవి నేర్చుకోవడం వంటివి చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగు పడుతుంది. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల కూడా బ్రెయిన్ చురుకవుతుంది. అలాగే ప్రతి రోజూ చల్లటి నీటిలో కాసేపు స్నానం చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గి.. మెదడు యాక్టీవ్ అవుతుంది.