
'మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం' అంటూ టీవీల్లో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం రోజుకు ఒక పెగ్ అయినా పడాల్సిందేనని అనుకుంటారు. ఇక మందు బాబుల సంగతి గురించి చెప్పాల్సిన పని లేదు. మందు షాపుల ముందే తాగేసి పడుకుంటారు.

మద్యం తాగడం వల్ల లివర్, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణాల మదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరించినా పెద్దగా పట్టంచుకోరు. మరి మద్యం సేవించినా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టమే కదా.. కానీ పెద్దగా చింతించాల్సిన పని లేదని సైంటిస్టులు అంటున్నారు.

ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో మద్యం సేవించినా లివర్ పాడవకూడదంటే ఏం చేయాలని పలువురి మీద పరిశోధనలు చేశారు. ఇందులో మద్యం తాగినప్పుడు పచ్చి మిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదని తేలింది.

ఎందుకంటే పచ్చి మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మద్యం తాగినప్పుడు పచ్చి మిర్చి తింటే.. ఆ యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌కు రక్షణగా నిలుస్తాయి. దీని వలన లివర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు.

పచ్చి మిర్చి తిని మద్యం సేవిస్తే లివర్‌పై ఎంలాంటి ప్రభావం పడదని, లివర్‌కు మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ మంచిదని అదే పనిగా తాగి, పచ్చి మిర్చి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)