చాలా మంది ఇప్పుడు అన్నంకు బదులు చపాతీలు తింటూంటారు. మధ్యాహ్నం ఏం తిన్నా.. సాయంత్రం చపాతీలు ఉండాల్సిందే. వీటిని ఇష్టపడని వారుండరు. చపాతీలు తింటే వెయిట్ లాస్ కు కూడా అవుతారు. చాలా మంది చపాతీలు తినడం ఇష్టమే కానీ.. చేయడమే కష్టం. కొంత మందికి అసలు చపాతీలు చేయడం అస్సలు రాదు. ఎలా పడితే అలా చేసేస్తారు. దీంతో అవి కాస్తా గట్టిగా రాయిల్లా మారతాయి.
చపాతీలు చేయడంలో పిండిని కలపడంలోనే టెక్నిక్ ఉంటుంది. పిండిని కలిపేటప్పుడు గోరు వెచ్చని నీటిని, పాలు కలపాలి. అలాగే నెయ్యి కూడా ఉపయోగించుకోవచ్చు. నూనె వేసినా, నెయ్యి వేసి కలిపినా ఓ అరగంట సేపైనా పిండిని పక్కకు పెట్టు కోవాలి. నెయ్యి వేస్తే చపాతీలు మృదువుగా, సాఫ్ట్ గా దూదిలా వస్తాయి.
చపాతీలు కలపడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. చాలా మంది చపాతీలు చేసేటప్పుడు కర్రతో బాగా గట్టిగా ప్రెస్ చేస్తారు. దీని వల్ల అవి గట్టిగా వస్తాయి. అలాగే పిండి కూడా ఎక్కువగా చల్లుతారు. ఇలా పిండిని ఎక్కువగా చల్లితే చపాతీలు పొడిగా వస్తాయి.
కొంత మంది పెనం వేడెక్కకుండానే చపాతీని వేసేస్తారు. దీని వల్ల కూడా చపాతీలు చల్లారాక గట్టిగా వస్తాయి. పెనం బాగా వేడెక్కాక.. ఒక వైపు కొద్దిగా కాలాక.. మరోవైపుకు తిప్పు కోవాలి. ఇలా రెండు మూడు సార్లు తిప్పుకుంటూ కాల్చు కోవాలి.
అదే విధంగా చపాతీలు కాల్చేటప్పుడు లేదా కాల్చాక అయినా కూడా నెయ్యి వేసి ఓ గిన్నెలో లేదా హాట్ బాక్స్ లో అయినా పెడితే.. చపాతీలు గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి. అంతే కాకుండా టేస్ట్ కూడా బావుంటుంది.