
తమ పిల్లలు అన్నింట్లో ముందు ఉండాలని ప్రతీ పేరెంట్స్ కోరుకుంటారు. అలా ఉండాలంటే పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలి. పేరెంట్స్ పిల్లలకు చెప్పడమే కాకుండా.. వారికి సరైన ఆహారం కూడా అందించాలి. కానీ పిల్లలు అన్నీ తినరు. వారికి ఇష్టమైన కొన్ని ఆహారాలే తీసుకుంటూ ఉంటారు.

కనీసం ఈ కింది ఫుడ్స్ అయినా పిల్లలు తినేలా చూసుకోండి. వారికి నచ్చిన స్టైల్‌లో కుక్ చేసి ఇవ్వండి. వీటిని కనుక పిల్లలు తింటే.. వారి బ్రెయిన్ కంప్యూటర్ కంటే షార్ప్‌గా పని చేస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కోడి గుడ్లు ఎంతో పౌష్టికరమైన ఆహారం. పిల్లలకు ప్రతి రోజూ ఓ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వండి. ఇది తింటే వారి బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. గుడ్లు రోజూ తినడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే విధంగా పిల్లలకు బెర్రీలు ఇస్తూ ఉండండి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

పిల్లలకు తక్షణ శక్తిని అందించడంలో కార్బోహైడ్రేట్స్ చక్కగా పని చేస్తాయి. అంతే కాకుండా ఇవి తింటే రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు కూడా ప్రతిరోజూ ఏదో రూపంలో అందిస్తూ ఉండండి.

అంతే కాకుండా నట్స్, బ్రోకలి, ఆకు కూరలు తరచూ వారి డైట్‌లో యాడ్ చేస్తూ ఉండి. ఇవి తినడం వల్ల పిల్లలకు మంచి విటమిన్లు ఎ, కె, ఐరన్ అందుతాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. బ్రెయిన్ యాక్టీవ్‌గా, షార్ప్‌గా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఓ అరటి పండు కూడా ఇవ్వడండి.