
మనుషులకు ఎవరికైనా సరే కలలు రావడం అనేది సహజం. కలలను బట్టి మీ భవిష్యత్తు ఏంటో.. ఎలాగ ఉంటుందో చెప్పగలం. నిద్రలో అనేక రకాలైన కలలు వస్తాయి. కొన్ని మీకు సంతోషాన్ని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం భయానికి గురి చేస్తాయి. మరి ఎలాంటి కలలు వస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఒక్కోసారి మీ కలలో నదులు, సముద్రాలు, చెరువులకు సంబంధించిన కలలు వస్తూ ఉంటాయి. ఇలా నీటికి సంబంధించిన కలలు రావడం శుభ పరిణామం అని డ్రీమ్ సైన్స్ చెబుతుంది. మీపై వర్షం కురిసినా కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు.

మీ కలలో మామిడి పండ్లు కనిపించినా కూడా మీకు శుభమే జరుగుతుంది. మామిడి పండ్లు కనిపించడం వల్ల మీ జీవితంలో ఉండే సమస్యల్నీ తొందరగా తొలగిపోతాయని అర్థం. మీరు చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులకు.. మంచి పరిష్కారం లభిస్తుంది.

మీ కలలో తామర పువ్వు కనిపించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మీ జీవితంలో జరిగే అన్ని సమస్యలను త్వరలోనే అధిగమించబోతున్నారని సూచిస్తుంది. అలాగే కలలో మీరు ధార్మిక ప్రయాణం చేస్తే.. సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుందని అర్థం.

అదే విధంగా మీకు కలలో వేణువు కనిపించినా.. దాని ట్యూన్ విన్నట్టు ఉన్నా చాలా మంచిది. దీన్ని డ్రీమ్స్ సైన్స్ శుభ సంకేతంగా చెబుతుంది. వేణువు అనేది శుభం, మాధుర్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. ఇలాంటి కల మీకు వస్తే.. మీ జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు.