
రాత్రి పడుకునే ముందు రెండు చెంచాల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని మరిగించకుండా తాగాలి. మిగిలిన జీలకర్ర గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. మీ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో జీలకర్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. మన జీవక్రియను పెంచుతుంది. ఇలా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించి బరువు తగ్గించేందుకు జీలకర్ర సహాయపడుతుంది.

అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మీకు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, జీలకర్ర మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. జీర్ణక్రియకు ఇది చాలా మంచి ఔషధం. డయాబెటిక్ రోగులకు జీలకర్ర విరుగుడుగా సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఐరన్ లోపం అనీమియా ఉన్నవారు తప్పనిసరిగా జీలకర్రను ఆహారంలో చేర్చుకోవాలి. బహిష్టు సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మొటిమలతో బాధపడేవారికి కూడా జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ ఆహారంలో చేర్చుకోవడం చాల ముఖ్యం అంటున్నారు నిపుణులు.

అంతేకాదు..గర్భిణీలకు కూడా జీలకర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భిణీలలో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లులు కూడా రోజూ జీలకర్ర నీటిని తాగడం మంచిది. జీలకర్ర నీటిని తాగడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. తల్లీ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీలకర్ర నీటితో శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీటిలోని యాంటీ కంజెస్టివ్ లక్షణాలు ఛాతిలో పేరుకుపోయిన మ్యూకస్ కరిగింపజేస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీర పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షిస్తుంది.