ఒక కప్పు చాయ్ రూ.80.. టీ తాగాలా.. వద్దా?.. పెరుగుతున్న చాయ్ ధరలపై హైదరాబాద్‌లో పెద్ద చర్చ!

Edited By:

Updated on: Jun 04, 2026 | 12:50 PM

హైదరాబాద్‌లో చాయ్ ధరల పెంపు ప్రస్తుతం నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తున్న ఇరానీ చాయ్ ధర.. ఇప్పుడు గణనీయంగా పెరగడంతో టీ ప్రియులకు నిరాశ పుట్టిస్తోంది. ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ చాయ్ కేంద్రం టీ ధరలను పెంచడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ మొదలైంది.

1 / 5
'చాయ్ చటుక్కున తాగరా భాయ్!..' అని మెగాస్టార్ లాంటివాడే ఓ సినిమాలో టీ గొప్పతనాన్ని వివరించాడు. నిజమే.. మనలో చాలా మందికి పొద్దున్న లేస్తేనే కడుపులో చాయ్ పడాల్సిందే. చాయ్ తాగితేనే చాలా మందికి మరో కొత్త రోజు ప్రారంభమవుతుంది. అంతలా మన జీవితాల్లో ఇమిడిపోయిన చాయ్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. చాయ్ ప్రియులకు కష్టాలు తెప్పిస్తోంది. చిన్న హోటల్లో 30 రూపాయలకు దొరికే చాయ్.. పెద్ద హోటళ్లలో మాత్రం 80 రూపాయలకు చేరింది.

2 / 5
హైదరాబాద్‌లో చాయ్ ధరల పెంపు ప్రస్తుతం నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తున్న ఇరానీ చాయ్ ధర.. ఇప్పుడు గణనీయంగా పెరగడంతో టీ ప్రియులకు నిరాశ పుట్టిస్తోంది. ఇటీవల నగరంలోని ఓ ప్రముఖ చాయ్ కేంద్రం టీ ధరలను పెంచడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రస్తుతమున్న ధరలను బట్టి ఒక ఫుల్ టీ ధర రూ.80, సింగిల్ టీ ధర రూ.60గా ఉండటంపై నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

3 / 5
అసలే పొద్దున్న లేవగానే కడుపులో టీ పడాలి.. లేదా ఆఫీసు పనుల్లో ఉపశమనం కోసం సాయంత్రం పూట టీ తాగాలి. ఇలాంటి పరిస్థితికి అలవాటు పడి ఉన్నప్పుడు పెరుగుతున్న ధరలతో టీ తాగాలా వద్దా అన్న సందిగ్ధతలో పడిపోతున్నారు చాలా మంది. అలా అని తాగకుండా ఉండలేని పరిస్థితి మరోవైపు.హైదరాబాద్ నగరంలో చాయ్‌కి పెట్టింది పేరు ఇరానీ చాయ్. చాలా మంది హైదరాబాదీలు ఇరానీ చాయ్‌ని నగర సంస్కృతిలో భాగంగా భావిస్తారు. అందుకే చాయ్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని పలువురు అంటున్న మాట.

4 / 5
సాధారణ పదార్థాలతో తయారయ్యే పానీయానికి ఇంత పెద్దమొత్తంలో ధరలు వసూలు చేయడం ఏంటని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతమున్న అధిక ధరల నేపథ్యంలో మరికొందరు తక్కువ ధరలకు చాయ్ అందించే చిన్న కేఫ్‌లు, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడే మరో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ధరల పెంపును సమర్థించే వర్గాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, అద్దెలు, విద్యుత్ చార్జీలు వంటి కారణాల వల్ల ధరలను సవరించడం వ్యాపారపరంగా ఖచ్చితంగా అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

5 / 5
నిత్య జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్న చాయ్ ధరల పెంపుపై ఇప్పుడు నగరంలో పెద్ద చర్చే నడుస్తోంది. హోటళ్లకు వచ్చి చాయ్ సేవించే ఓ వర్గం వినియోగదారులు.. కేవలం చాయ్ కోసం మాత్రమే కాకుండా, సౌకర్యవంతమైన వాతావరణం, ఎయిర్ కండిషన్డ్ సీటింగ్, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన వసతులు, మెరుగైన సేవల కోసం కూడా డబ్బులు చెల్లిస్తున్నారని వాదిస్తున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో చాయ్ హోటళ్లలో ఎప్పటిలాగే రద్దీ కొనసాగుతుండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. చాయ్ ధరల పెంపుపై హైదరాబాద్‌లో నడుస్తున్న చర్చలు మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us