
ఆవు నెయ్యితో చర్మానికి మసాజ్ చేస్తే మీ స్కిన్ గ్లో పెరుగుతుంది. దీనికోసం వారంలో రెండుసార్లు ఆవు నెయ్యితో పూర్తి చర్మాన్ని మసాజ్ చేయండి. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి ఆవు నెయ్యిని మాయిశ్చరైజర్ లాగా రాసుకోండి. దీనికోసం తాజా, ఆర్గానిక్ ఆవు నెయ్యిని చిటికెడు తీసుకుని ముఖానికి రాసుకుంటే సరిపోతుంది. ఉదయం లేవగానే మీ చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.

ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఆవు నెయ్యి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం అరస్పూన్ నెయ్యిలో చిటికెడు పసుపు కలిపి పేస్ట్ చేయండి. దీనిని చర్మానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే స్కిన్ మృదువుగా, అందంగా ఉంటుంది.

శనగ పిండిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి, నీళ్లు లేదా పాలు వేసి పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చర్మ మృతకణాలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే, పగిలిన పెదాలకు కూడా ఆవు నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది.

చలికాలంలో చేతులు, కాళ్లు తొందరగా పగిలిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రిపూట చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుని నెయ్యిని అప్లై చేయండి. ఉదయం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఆవు నెయ్యిలో కొద్దిగా తేనె, పచ్చి పాలు కలిపి పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. అందంగా కనిపిస్తారు.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించడంలోనూ ఆవు నెయ్యి సహాయపడుతుంది. దీనికోసం రాత్రి పడుకునే ముందు కళ్ల కింద ఆవు నెయ్యితో మర్దన చేయండి. ఉదయం క్లీన్ చేసుకుంటే నల్లటి వలయాలు సులువుగా తగ్గుతాయి.

అంతేకాదు.. పాదాల పగుళ్లు నివారించడంలో ఆవు నెయ్యి సహాయపడుతుంది. పాదాలు ఎల్లపుడూ మృదువుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యిని పాదాలకు రాసుకుని సాక్స్‌లు ధరించి నిద్రపోండి. ఉదయం క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.